(Local) Sat, 24 Aug, 2019

కోలీవుడ్ కమెడియన్ కన్నుమూత!

June 10, 2019,   5:23 PM IST
Share on:

కోలీవుడ్ కి చెందిన ప్రముఖ సీనియర్ కమెడియన్ క్రేజీ మోహన్(67) ఈరోజు మధ్యాహ్నం మరణించారు. ఇవాళ ఆయనకు గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని దగ్గరలోని కావేరి హాస్పిటల్‌కు తరలించారు. డాక్టర్లు ఆయన్ను కాపాడడానికి చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఆయన కన్నుమూశారు. 1952లో పుట్టిన ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇంజనీరింగ్ చదివే రోజుల్లోనే కొన్ని నాటకాలకు స్క్రిప్ట్ లు రాశారు. ఆ తరువాత ఓ నాటక కంపనీకి స్క్రిప్ట్ రైటర్ గా పని చేసి 'పొయ్‌క‌ల్ కుద‌రై' అనే సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన సినిమాలకి  క్రేజీ మోహన్ కి మంచి పేరు తీసుకొచ్చింది. అపూర్వ స‌హోద‌రులు, మైకేల్ మ‌ద‌న కామ‌రాజు, స‌తీలీలావ‌తి, తెనాలి, పంచ‌తంత్రం, కాద‌ల కాద‌ల‌, భామ‌నే స‌త్య‌భామ‌నే, వ‌సూల్ రాజా ఎం.బి.బి.ఎస్ వంటి చిత్రాల్లో కమెడియన్ గా నటించాడు. నటుడిగా, రైటర్ గానే కాదు.. చిత్రకారుడిగా కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఈయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.