(Local) Mon, 01 Mar, 2021

‘సైరా’లో పరుష పదాలు...మ్యూట్‌

September 28, 2019,   1:40 PM IST
Share on:
‘సైరా’లో పరుష పదాలు...మ్యూట్‌

మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'సైరా నరసింహారెడ్డి' చిత్రం అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా అయిదు భాషల్లో విడుదలవుతుంది. బ్రిటిష్ వారిపై తిరగబడిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు రాయలసీమ పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని ఇందులో తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం స్టార్టింగ్ నుండి ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు మెగాస్టార్ కి మధ్య వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. కాగా నరసింహారెడ్డి జీవిత విశేషాలను, ఇతర వివరాలను తమ ద్వారా తెలుసుకుని, తర్వాత డబ్బులు ఇవ్వలేదని ఆయన బంధువులు ఆరోపించడంతో వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. చిత్రబృందం కూడా ఇది బయోపిక్ కాదని చెప్పేసింది. తాజాగా సెన్సార్ బోర్డు కూడా దీనికి సంబంధించి మూవీ టీఎంకు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు చెప్పుకునే కథల ఆధారంగా తీసిన ఫిక్షన్(కల్పిత కథ) అని డిస్ క్లెయిమర్ వేయాలని, సైరాది తొలి స్వాతంత్ర సంగ్రామంగా, తొలి యుద్ధంగా పేర్కొనకూడదని బోర్డు స్పష్టం చేసింది. ఇది ఏ సామాజిక వర్గాన్ని కించపరచేది కాదని చెప్పాలని, ‘ల*జల’, ‘ఫ* ఆఫ్’, ‘ఫ*’, ‘బా*ర్డ్’ వంటి పరుష పదాలను  వచ్చే చోట మ్యూట్ చేయాలని ఆదేశించింది. 
 

సంబంధిత వర్గం
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.