(Local) Sun, 23 Feb, 2020

బల్లి పాత్ర ఫస్ట్ లుక్....దబాంగ్ 3

October 08, 2019,   5:33 PM IST
Share on:
బల్లి పాత్ర ఫస్ట్ లుక్....దబాంగ్ 3

దసరా కానుకగా టాలీవుడ్ హీరోలు తమ లేటెస్ట్ మూవీ సంబంధించి కొత్త పోస్టర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే...తాజాగా కన్నడ హీరో సుదీప్ బాషా బేధం లేకుండా అన్ని భాషల్లో నటిస్తూ నేషనల్ వైడ్ గా మంచి క్రేజ్ అందుకుంటున్నాడు. టాలీవుడ్, కోలీవుడ్ లో ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న సుదీప్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా సాలీడ్ క్యారెక్టర్ తో సిద్ధమయ్యాడు. సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 సినిమాలో సుదీప్ విలన్ గా నటించబోతున్న విషయం తెలిసిందే. దసరా కానుకగా సుదీప్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని హీరో సల్మాన్ ఖాన్ విడుదల చేశారు. విలన్ ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది.. అలాంటి విలన్ తో పోరాడితేనే మజా వస్తుందని సల్మాన్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఇక దబాంగ్ 3లో సుదీప్ బల్లి అనే పాత్రలో కనిపించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. సల్మాన్ సొంత ప్రొడక్షన్ హౌస్ సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్ తో పాటు ఆర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్ – సఫ్రోన్ బ్రాడ్ క్యాస్ట్ అండ్ మీడియా లిమిటెడ్ ఈ మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో సల్మాన్ సరసన సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత వర్గం
బాలీవుడ్ హీరో బర్త్ డే కి సోదరి డెలివరీ...
బాలీవుడ్ హీరో బర్త్ డే కి సోదరి డెలివరీ...
వార్ ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ...
వార్ ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.