(Local) Mon, 06 Apr, 2020

'అసురన్' మూవీ పట్ల సంతోషంగా లేను...వెట్రిమారన్‌

October 22, 2019,   7:33 PM IST
Share on:
'అసురన్' మూవీ పట్ల సంతోషంగా లేను...వెట్రిమారన్‌

తమిళ్ సూపర్ స్టార్ ధనుష్ హీరోగా, మలయాళ నటి మంజువారియర్‌ హీరోయిన్ గా వెట్రి మారన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'అసురన్'. ఈ చిత్రంలో ధనుష్ ద్విపాత్రాభినయం పోషించారు. ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదలై, విజయవంతంగా ప్రదర్శింపబడుతూ.. రీసెంట్‌గా రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తెరకెక్కించిన అసురన్ డైరెక్టర్ వెట్రిమార‌న్ మాత్రం కొంచం అసంతృప్తిగా ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు. ఇది తన కెరీర్‌లోనే అత్యంత వేగంగా తీసిన సినిమా అని పలు ఇంటర్వ్యూల్లో వెట్రిమారన్‌ చెప్పారు. కాగా ‘అసురన్‌’ అవుట్‌పుట్‌ విషయంతో సంతోషంగా లేననని వెట్రిమారన్‌ తాజాగా మీడియాతో అన్నారు. ‘నేను ‘అసురన్‌’ను పూర్తి చేసిన విధానం పట్ల సంతోషంగా లేను. సినిమాను అనుకున్నట్లు షూట్‌ చేయలేదు, కొంతభాగం వదిలేయాల్సి వచ్చింది. ఏదేమైనప్పటికీ అదృష్టం కొద్దీ  ప్రజలకు చిత్రం నచ్చింది. మంచి వసూళ్లు కూడా వస్తున్నాయి. కానీ సినిమాను ముగించిన విధానం విషయంలో సంతోషంగా లేను. ఇంకా 22 రోజుల షూట్‌ మిగిలి ఉన్నప్పుడు.. 40 రోజుల్లో చిత్రాన్ని విడుదల చేయాలని నాకు చెప్పడంతో.. తీయాల్సిన చాలా షూటింగ్ భాగం తీయలేకపోయామని’ ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వర్గం
ప్రముఖ కోలీవుడ్ నటుడు కన్నుమూత..!
ప్రముఖ కోలీవుడ్ నటుడు కన్నుమూత..!
'అసురన్' ని మెచ్చిన సూపర్ స్టార్
'అసురన్' ని మెచ్చిన సూపర్ స్టార్

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.