(Local) Wed, 16 Oct, 2019

సీనయ్య చిత్రం ఫస్ట్ లుక్...

October 08, 2019,   11:36 PM IST
Share on:
సీనయ్య చిత్రం ఫస్ట్ లుక్...

వెండితెరపై ఎప్పుడు ఎవరు ఆ పాత్రలో దర్శనమిస్తారో చెప్పడం కొంచం కష్టమే...హీరోలు విలన్ గా, కామెడీ యాక్టర్స్ హీరోలుగా నటించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా డైరెక్టర్స్ హీరోలుగా తెరమీద కనిపించడానికి సిద్ధం అవుతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ లో డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ హీరోగా పరిచయమవుతున్నారు.  విజయ దశమి సందర్భంగా తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాకు ‘సీనయ్య’ (కంప్లీట్ ఎమోషన్) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. హీరో లుక్‌లో వినాయక్ అదిరిపోయాడు.. వినయ్ ఈ సినిమాలో రైతుగా కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి.. కట్ చేస్తే ఫస్ట్ లుక్‌లో ఆయన మెడలో ఎర్ర కండువాతో.. పెద్ద రెంచీ పట్టుకుని ఉన్నారు. గ్యారేజ్ బ్యాక్ డ్రాప్ చూస్తుంటే మెకానిక్‌గా కనిపించనున్నారని అర్థమవుతుంది. అంతేకాక ఈ పోస్టర్ లుక్ లో వినాయక్‌ మాస్‌ లుక్‌తో దర్శనమిస్తున్నాడు.  డైరెక్టర్‌ శంకర్‌ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన ఎన్.నరసింహ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. గతంలో ఈయన శరభ అనే సినిమాను తెరకెక్కించారు.

సంబంధిత వర్గం
13నెలల చిన్నారికి గుండె ఆపరేషన్....మనసున్న మారాజు
13నెలల చిన్నారికి గుండె ఆపరేషన్....మనసున్న మారాజు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.