(Local) Tue, 21 May, 2019

“ఫలక్ నుమా దాస్”ట్రైలర్ విడుదల

May 14, 2019,   2:03 PM IST
Share on:

విశ్వక్ సేన్ ప్రధాన పాత్ర పోషిస్తూ దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన చిత్రం “ఫలక్ నుమా దాస్”. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ సంస్థతో పాటు మూడు బ్యానర్లు కలిసి విడుదల చేస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం విడుదలైన “ఫలక్ నుమా దాస్” టీజర్ ప్రేక్షకులపై బాగానే ఇంపాక్ట్ చూపించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ లో చిన్నప్పటినుండే గ్యాంగ్ వార్ పై ఇష్టం పెంచుకున్న దాస్ అనే కుర్రాడు ఫలక్ నుమాలో లీడర్ గా ఎదగాలని ప్రయత్నిస్తుంటాడు. దూకుడుగా వ్యవహరిస్తూ గల్లీలో మటన్ బిజినెస్ మొదలుపెడతాడు. ఈ క్రమంలో అపోజిషన్ వాళ్లతో గొడవలు, మధ్యలో దాస్ ప్రేమ కథ మొదలగు సన్నివేశాలను చూపించారు. ఒకట్రెండు చోట్ల బూతులు కూడా వినిపించాయి. బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.