(Local) Sat, 23 Oct, 2021

ఫెవిక్విక్‌ బామ్మ ఇకలేరు...

November 29, 2019,   1:27 PM IST
Share on:
ఫెవిక్విక్‌ బామ్మ ఇకలేరు...

ఫెవిక్విక్‌ బామ్మ పుష్ప జోషి(87) ఈ నెల మంగళవారం 26న తుదిశ్వాస విడిచారు. కాగా ఈ బామ్మ 2018లో తన 85వ ఏట బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలోకి అజయ్ దేవ‌గ‌ణ్ నటించిన 'రైడ్‌' చిత్రంతో తొలిసారి వెండితెరకి పరిచయమైంది. రైడ్ చిత్రంలో త‌న న‌ట‌న‌తో అల‌రించిన బామ్మ ఆ త‌ర్వాత రాంప్ర‌సాద్ కి తెహ‌ర్వీ అనే చిత్రంలోను క‌నిపించారు. అయితే ఫెవిక్విక్ యాడ్‌తో ఫుల్ ఫేమ‌స్ అయిన ఈ బామ్మ మంగ‌ళ‌వారం క‌న్నుమూశారు. గ‌త వారం త‌న ఇంట్లో జారి ప‌డడంతో ఆమెని ముంబైలోని ఆసుప‌త్రికి చేర్పించారు. మంగ‌ళ‌వారం ఆమె క‌న్నుమూశారు. పుష్ప జోషి మృతికి ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీలు నివాళులు అర్పించారు. రైడ్ చిత్రాన్ని తెర‌కెక్కించిన రాజ్‌కుమార్ గుప్తా.. త‌న ట్విట్ట‌ర్‌లో పుష్పా జోషి ఇక లేర‌నే వార్త నన్ను ఎంత‌గానో భాధించింది. నేను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రాల‌లో ఒక‌టైన రైడ్‌లో నీ న‌టన ఎప్ప‌టికి గుర్తుంటుంది. సెట్‌లో ఎప్పుడు న‌వ్విస్తూ ఉండే మీరు మ‌మ్మ‌ల్ని వ‌దిలి వెళ్ల‌డం చాలా బాధ‌గా అనిపిస్తుంది. మీరు ఎక్క‌డ ఉన్నా అక్క‌డ సంద‌డి వాతావ‌ర‌ణం ఉంటుంది. మిమ్మ‌ల్ని మిస్ కావ‌డం చాలా బాధ‌గా ఉందని త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు రాజ్‌కుమార్.

 

సంబంధిత వర్గం
వైరల్ అవుతున్న బాలయ్య పార్టీ డ్యాన్స్...
వైరల్ అవుతున్న బాలయ్య పార్టీ డ్యాన్స్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.