(Local) Mon, 01 Mar, 2021

'చాణక్య'కి సెన్సార్ పూర్తయింది !

October 03, 2019,   9:44 PM IST
Share on:
'చాణక్య'కి సెన్సార్ పూర్తయింది !

ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మాణంలో తిరు దర్శకత్వంలో మ్యాచో హీరో గోపిచంద్, మెహరీన్ జంటగా తెరకెక్కిన మూవీ 'చాణక్య'. ఈ మూవీలో గోపిచంద్ స్పై థ్రిల్లర్‌గా అర్జున్ అనే 'రా' ఏజెంట్‌గా తొలిసారి నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ జరీన్ ఖాన్ ఇంపార్టెంట్ రోల్ చేసింది. ఈ మూవీ గోపిచంద్ 26వ సినిమా ఇది.ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అండ్ లిరికల్ సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి..రీసెంట్‌గా చాణక్య సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా చూసిన సెన్సార్ టీమ్.. యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. కథా కథనం, గోపిచంద్ హై ఓల్టేజ్ యాక్షన్, మెహరీన్ గ్లామర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, విజువల్స్, ఆర్ఆర్ అన్నీ హైలెట్ అయ్యాయని.. సినిమా కచ్చితంగా అలరిస్తుందని సెన్సార్ సభ్యులు చెప్పారు.దసరా కానుకగా అక్టోబర్ 5న చాణక్య గ్రాండ్‌గా విడుదలవుతోంది. 

సంబంధిత వర్గం
కబడ్డీ కోచ్ గా మ్యాచో స్టార్....
కబడ్డీ కోచ్ గా మ్యాచో స్టార్....
గోపిచంద్ తో జోడీగా మిల్కీ బ్యూటీ...
గోపిచంద్ తో జోడీగా మిల్కీ బ్యూటీ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.