(Local) Mon, 01 Mar, 2021

గోపీచంద్ మార్కెట్ ఇంతేనా?

October 04, 2019,   6:39 PM IST
Share on:
గోపీచంద్ మార్కెట్ ఇంతేనా?

మ్యాచోస్టార్‌ గోపీచంద్‌ హీరోగా,  మెహ్రీన్ హీరోయిన్ గా తిరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చాణక్య’. ఈ మూవీలో గోపిచంద్ స్పై థ్రిల్లర్‌గా అర్జున్ అనే 'రా' ఏజెంట్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రేపు అక్టోబర్ 5న రిలీజ్ అవుతోంది. ఈ ‘చాణక్య’ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయట. ట్రైలర్ ప్రకారం ఇది ఇండో – పాక్ బోర్డర్ నేపథ్యంలో జరిగే కథలా కనిపిస్తుంది. డైరెక్టర్ తీరు ఈ మూవీని యాక్షన్ సీన్స్ ని హైలైట్ చేస్తూ తెరకెక్కినచినట్టు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈసినిమా నాన్ – థియేట్రికల్ రైట్స్ కి భారీ మొత్తం వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు శాటిలైట్ హక్కులకు 4 కోట్లు వస్తే.. అలాగే డిజిటల్ రైట్స్ కు అమెజాన్ 2 కోట్లు వచ్చిందంట. ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ కి ఏకంగా రూ.9 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా మొత్తం కలుపుకుంటే ఈమూవీ కి నాన్ – థియేట్రికల్ రైట్స్ కింద చాణక్యకు 15 కోట్లు వరకూ గిట్టుబాటు అయిందట.

సంబంధిత వర్గం
కబడ్డీ కోచ్ గా మ్యాచో స్టార్....
కబడ్డీ కోచ్ గా మ్యాచో స్టార్....
గోపీచంద్ 'చాణక్య' పరిస్థితి ఏంటి ?
గోపీచంద్ 'చాణక్య' పరిస్థితి ఏంటి ?

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.