(Local) Mon, 01 Mar, 2021

సైరాని ఎదుర్కొనే దమ్ము నాకు ఉంది - గోపీచంద్

October 01, 2019,   3:59 PM IST
Share on:
సైరాని ఎదుర్కొనే దమ్ము నాకు ఉంది - గోపీచంద్

ఈ ఏడాది దసరాకి రాబోతున్నా అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం సైరా...కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ లో మెగావారసుడు రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు,తమిళ్,హిందీ,మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతుంది. అయితే ఈ చిత్రం కోసం మెగా అభిమానులే కాకుండా చాల మంది ప్రేక్షుకులు ఎదురుచూస్తున్నారు. అయితే అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ‘సైరా’ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. 280 కోట్ల భారీ బడ్జెట్ మూవీ నేపథ్యంలో సైరాని సోలోగా అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అయితే సైరా లాంటి భారీ బడ్జెట్ మూవీతో చాణక్య పోటీపడటం ఆసక్తిని రేపుతోంది. అయితే సైరా చిత్రంతో పోటీ ఏంటీ అంటూ కామెంట్స్‌ వినిపిస్తున్న నేపథ్యంలో గోపీచంద్ తాజాగా స్పందించారు.. గోపీచంద్ మాట్లాడుతూ.. ‘నిజానికి చాణక్య మూవీని మేము ‘మే’ నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నామని, కానీ, నేను గాయపడిన తరువాత షూటింగ్ ఆలస్యం అయింది. ఇక ఆ తరువాత, అక్టోబర్ 3న మా సినిమాను విడుదల చేయాలనుకున్నాము, అప్పటికీ సైరా విడుదల తేదీ ప్రకటించలేదు. ఇక సైరా అక్టోబర్ 2 విడుదల అని ప్రకటించాక, మేము అక్టోబర్ 5న చాణక్య రిలీజ్ ప్లాన్ చేశాము. అయితే దసరా హాలిడేస్ కాబట్టి చాణక్యను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. పైగా చాణక్య మరియు సైరా రెండు సినిమాలు వేరు వేరు నేపథ్యాలకి సంబంధించినవి’ అని గోపిచంద్ చెప్పారు. 

సంబంధిత వర్గం
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...
చిరు ఆతిథ్యంలోనే 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్‌ ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.