(Local) Sun, 17 Jan, 2021

గోపీచంద్‌ ‘చాణక్య’ టీజర్‌.....

September 09, 2019,   6:25 PM IST
Share on:
గోపీచంద్‌ ‘చాణక్య’ టీజర్‌.....

2001లో తొలి వలపు చిత్రం ద్వారా తెలుగు తెరపై హీరోగా తెరంగ్రేటం చేసిన గోపీచంద్. ఆ తర్వాత 2002లో తేజ దర్శకత్వంలో జయం చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో అందరి మెప్పించాడు. గోపీచంద్ తన కెరీర్ లో కొన్ని చిత్రాలలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తూ 2004లో మళ్ళీ యజ్ఞం మూవీ ద్వారా హీరోగా తెరపై కనివిందు చేసాడు. తాజాగా ఈ యంగ్ హీరో గోపీచంద్, మెహరీన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘చాణక్య’. తిరు దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తైంది. ఇండో – పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు, అలాగే సెకెండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. ఈ టీజర్ లో గోపీచంద్ లుక్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు గోపీచంద్. ఈ టీజర్ చూసిన ప్రేక్షకులు ఈ చిత్రంతో గోపిచంద్ మంచి హిట్ కొడ‌తాడ‌ని భావిస్తున్నారు. ద‌స‌రా కానుక‌గా చిత్రం విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది. 

సంబంధిత వర్గం
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.