(Local) Fri, 24 Jan, 2020

తదుపరి విచారణ వరకు బిగ్ బాస్ నిర్వాహకులకు హైకోర్ట్ ఊరట!

July 18, 2019,   11:56 AM IST
Share on:
తదుపరి విచారణ వరకు బిగ్ బాస్ నిర్వాహకులకు హైకోర్ట్ ...

బిగ్ బాస్ రియాలిటీ షో దాదాపు అన్ని బాషలలో మొదలైంది. ఇంకా తెలుగులోనే మొదలుకావాల్సి ఉంది. అయితే  తెలుగులో ఇంకా షో స్టార్ట్ అవ్వకుండానే పలు రకాల వివాదాలకు తావు ఇస్తోంది. ముందుగా నాగార్జున హోస్ట్ అనగానే సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలుపెట్టారు. తాజాగా కొన్ని రోజుల క్రితం యాంకర్, జర్నలిస్ట్ శ్వేతా రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ షో ముసుగులో కాస్టింగ్ కౌచ్ నడుస్తోందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.  అలాగే నటి గాయత్రి గుప్త బిగ్ బాస్ షో నిర్వాహకులు మొదట్లో తనకు ఆఫర్ ఇచ్చి ఇప్పుడు అవకాశం లేదని అంటున్నారని, వారి వలన సినిమా ఆఫర్లు కోల్పోయాయని ఆరోపణలు చేశారు.  

దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి షోను నిలిపివేయాలని నేరుగా హైకోర్టుకు ఆశ్రయించారు. బిగ్‌ బాస్‌ షో నిర్వాహకులపై నమోదైన కేసు కొట్టివేయాలని క్వాష్‌ పిటిషన్‌ వేశారు నిర్వాహకులు. బంజారాహిల్స్‌‌లో నమోదైన కేసు కొట్టివేయాలని పిటిషనర్‌ కోర్టుని కోరారు. అయితే కేసు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకు, పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణవచ్చే వరకు నిర్వాహకులను అరెస్ట్‌ చేయవద్దంటూ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే బుధవారానికి వాయిదా వేసింది హైకోర్టు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.