(Local) Mon, 20 Sep, 2021

'సైరా'లో జగ్గూభాయ్ రోల్ ఇదే....

September 25, 2019,   12:03 PM IST
Share on:
'సైరా'లో జగ్గూభాయ్ రోల్ ఇదే....

ఈ ఏడాది దసరాకి రాబోతున్న భారీ చిత్రం 'Sye Raa'. కొణిదెల ప్రొడక్షన్స్ లో Ram Charan తెరకెక్కిస్తున్న ఈ మూవీలో Chiranjeevi హీరోగా నయనతార జంటగా కనిపించబోతున్నారు. మెగాస్టార్ ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాక ఈ చిత్రంలో వివిధ పరిశ్రమలకి చెందిన అగ్ర నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 2న తెలుగు, తమిళ్. మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకి సిద్ధంగా ఉంది. ఇక ఇందులో జగపతిబాబు ఒక కీ రోల్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో వీరారెడ్డి అనే పాత్ర జగ్గూభాయ్ చేశాడు. ఈ పాత్ర మొదటి నుండి ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి అనుచరుడిగా మరో పాలెగాడు ఉంటుంది. అయితే మధ్యలో బ్రిటిష్ వాళ్ళ మాటలకు లొంగిపోయి వాళ్ళకి మద్దతు పలికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి నమ్మకద్రోహం చేస్తాడు. అయితే చివరికి తన తప్పు తాను తెలుసుకొని నరసింహ రెడ్డితో కలిసి బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తాడు.

ఈ పాత్రకి జగపతి బాబు అయితే సరిగ్గా సరిపోతాడని భావించి అతన్ని తీసుకున్నారు, ఈ విషయం స్టేజి మీద మొన్న చిరంజీవి స్వయంగా చెప్పటం కూడా జరిగింది. ఈ క్యారెక్టర్ అనేది బాహుబలి లో కట్టప్ప తీరుని పోలి ఉంటుందని చెపుతున్నారు. ఒక్క జగపతి బాబు పాత్ర మాత్రమే కాదు, ఇందులోని ప్రధాన పాత్రలు అన్నిటికి కూడా తగినంత స్క్రీన్ టైమింగ్ ఉంటుందని, అలాగే కథలో ప్రతి పాత్ర ఒక కీ రోల్ ప్లే చేస్తుందని తెలుస్తుంది.

సంబంధిత వర్గం
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి
డెంగీతో తెలంగాణ బీజేపీ నాయకుడు మృతి

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.