(Local) Mon, 16 Sep, 2019

తిరుపతిలోనే నా పెళ్లి.....జాన్వీ కపూర్

September 10, 2019,   6:34 PM IST
Views: 39
Share on:
తిరుపతిలోనే నా పెళ్లి.....జాన్వీ కపూర్

దివంగత అతిలోక సుందరి శ్రీదేవి తనయురాలు జాన్వీ కపూర్ బాలీవుడ్ లో తొలి మూవీ "ధడక్"తోనే  మంచి విజయాన్ని అందుకుని విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా జాన్వీ తల్లి శ్రీదేవి గురించి అలాగే తన డ్రీమ్ బాయ్ గురించి బ్రైడ్స్‌ టుడేకిచ్చిన ఇంటర్వ్యూ లో బయటపెట్టింది. శ్రీదేవితో మీరెపుడైనా పెళ్లి గురించి మాట్లాడారా..అని జాన్వీని ప్రశ్నించారు. దీనికి జాన్వీ సమాధానమిస్తూ..పెళ్లి గురించి అమ్మతో మాట్లాడాను. అయితే మగవాళ్ల విషయంలో నా తీర్పుపై నమ్మకం లేదని అమ్మ చెప్పేది. అమ్మనే ఎవర్నో ఒకరిని ఎంపిక చేయాలనుకునేది. నేను ఎవరినైనా సులభంగా ప్రేమించడమే అందుకు కారణమని జాన్వీ చెప్పింది. తనకు కాబోయే జీవిత భాగస్వామికి ఉండాల్సిన లక్షణాలేంటని జాన్వీని అడుగగా..అతనికి తను చేసే పని పట్ల అంకితభావం ఉండాలి. మంచి టాలెంట్ ఉండాలి. అతని దగ్గర నుంచి కొత్త విషయాలు నేర్చుకునేలా ఉండాలి. అంతేకాకుండా అందరిని నవ్వించే స్వభావం ఉన్నవ్యక్తి అయి ఉండాలని చెప్పింది. ఇక తన పెళ్లి సంప్రదాయ పద్దతిలో తిరుపతిలో జరుగుతుందని వెల్లడించింది జాన్వీ. అంతేకాదు సంప్రదాయ కంజీవరమ్ చీరను ధరిస్తా. మొత్తం దక్షిణాది వంటకాలతో నా పెళ్లి వేడుక ఉంటుందని చెప్పుకొచ్చింది.

సంబంధిత వర్గం
శ్రీదేవి మైనపు విగ్రహం.... భావోద్రేకమైన భర్త
శ్రీదేవి మైనపు విగ్రహం.... భావోద్రేకమైన భర్త

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.