(Local) Wed, 23 Oct, 2019

జర్నలిస్టులపై కంగనా ఆగ్రహం!

July 11, 2019,   3:16 PM IST
Share on:
జర్నలిస్టులపై కంగనా ఆగ్రహం!

సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే క్వీన్ కంగనా ఎపుడు ఎదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. తాజాగా ఆమె ఈ నెల 7వ తేదీన తన తాజా చిత్రం ‘మెంటల్ హై క్యా’ చిత్రానికి సంబంధించి కార్యక్రమంలో మాట్లాడుతూ జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసింది, ‘మణికర్ణిక’ చిత్రం గురించి నీచంగా రాశారంటూ ఓ జర్నలిస్టును దుర్భాషలాడారు. దీంతో కంగన బహింరంగ క్షమాపణ చెప్పాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. లేకపోతే ఆమెను మేము కవరేజ్ చేయబోము అంటూ ప్రకటించింది. 

క్షమాపణ చెప్పేవరకు ఆమెకు మీడియా కవరేజ్ చేయమని ‘ఎంటర్ టైన్ మెంట్ జర్నలిస్ట్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ ప్రకటించింది. ఈ నేపథ్యంలో, చిత్ర నిర్మాత ఏక్తా కపూర్ జర్నలిస్టులకు క్షమాపణ చెప్పింది. కంగానా మాత్రం క్షమాపణ చెప్పలేదు. అంతేకాదు, అక్కడితో కంగనా రనౌత్ ఆగకుండా. మీడియాను దుర్భాషలాడుతూ ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో... ఫ్రీగా భోంచేసేందుకు ప్రెస్ మీట్లకు వస్తున్నారు. మిమ్మల్ని జర్నలిస్టులని ఏ ఆధారంతో పిలవాలి? నన్ను బ్యాన్ చేయమని చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నా. ఎందుకంటే నా పేరు చెప్పుకుని మీరు సంపాదించుకోవడం నాకు ఇష్టం లేదు. మీలాంటి సూడో జర్నలిస్టులు నా స్టేటస్ ను దెబ్బతీయగలరా?’ అని వీడియోలో కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.