(Local) Fri, 06 Dec, 2019

మెగా అల్లుడి సరసన కన్నడ భామ

November 16, 2019,   4:43 PM IST
Share on:
మెగా అల్లుడి సరసన కన్నడ భామ

మెగా ఫ్యామిలీ నుండి మెగా చిన్న అల్లుడైన క‌ల్యాణ్‌దేవ్‌ ఇదివరకే తెలుగు తెరపై 'విజేత' అనే చిత్రంతో మెగా అభిమానులను పలకరించిన సంగతి తెలిసిందే. తాజాగా క‌ల్యాణ్‌దేవ్‌ రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రిజ్వాన్ నిర్మాత‌గా పులివాసు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `సూప‌ర్‌మ‌చ్చి`. ఇటీవ‌ల ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేయ‌డంతో పాటు ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ ఫ‌స్ట్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రంలో క‌ల్యాణ్‌దేవ్ స‌ర‌స‌న క‌న్న‌డ బ్యూటీ ర‌చితా రామ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను న‌వంబ‌ర్ 22 నుండి ప్రారంభించ‌బోతున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.
 

సంబంధిత వర్గం
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ...
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ...
వింటేజ్ లుక్‌లో వెంకటేష్ 'ఎన్నాళ్ల‌కో..` సాంగ్
వింటేజ్ లుక్‌లో వెంకటేష్ 'ఎన్నాళ్ల‌కో..` సాంగ్

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.