(Local) Sun, 27 Sep, 2020

ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్షించాలి: కీర్తి సురేష్

November 30, 2019,   3:55 PM IST
Share on:
ప్రియాంక పై దారుణానికి పాల్పడిన వారిని వేటాడి శిక్ ...

షాద్ నగర్ లో  ప్రియాంక రెడ్డిపై అత్యాచారం చేసి హతమార్చిన హంతకులను వేటాడి శిక్షించాలని హీరోయిన్ కీర్తి సురేష్ తన ఆక్రోషాన్ని తెలిపింది. షాద్ నగర్ లో గురువారం డాక్టర్ ప్రియాంక రెడ్డిని నలుగురు మృగాలు అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి.. అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనపై కీర్తి సురేష్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.  ప్రియాంక రెడ్డి హత్య ఉదంతం విన్నాక గుండె పగిలినంత పనైందని, పరిస్థితులు రోజురోజుకూ భయానకంగా తయారవుతున్నాయని పేర్కొంది. సూపర్ సేఫ్ సిటీగా భావించే హైదరాబాద్ లోనే ఇలాంటి దారుణం జరిగిందంటే ఎవరిని నిందించాలని.. ఈ దారుణానికి పాల్పడిన క్రూరులని వేటాడి మరి శిక్షించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రియాంక రెడ్డి కుటుంభ సభ్యులకు నా ప్రగాడ సానుభూతిని తెలుపుతున్నానని కీర్తి భావోద్వేగ పోస్ట్ చేసింది.

సంబంధిత వర్గం
ప్రతి రోజు పండగే నుండి పాట విడుద‌ల
ప్రతి రోజు పండగే నుండి పాట విడుద‌ల

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.