(Local) Sat, 24 Aug, 2019

డియర్ కామ్రేడ్ ఈవెంట్ కి కె.జి.ఎఫ్ హీరో సందడి!

July 18, 2019,   11:12 AM IST
Share on:

ఒకప్పుడు అభిమానులకి తమ అభిమాన తార సినిమా రిలీజ్ అవ్వడమే సందడిగా ఉండేది. అయితే తాజాగా మనం గమనిస్తే కేవలం సినిమా రిలీజ్ మాత్రానే సందడిగా భావించటం లేదు సినిమా షూటింగ్ మొదలుకొని కంప్లీట్ అయ్యేవరకు ఎదో ఒక అప్డేట్ వస్తేనే  ఆనందిస్తున్నారు. అదే కోవలో ఈ మధ్య సినీ పరిశ్రమ కూడా అభిమానుల అభిరుచికి తగినట్టు మూవీ ప్రమేషన్స్ కోసం సరికొత్త పద్దతులను కనుగొంటున్నారు. తాజాగా తాజాగా, బెంగళూరులో ‘డియర్ కామ్రేడ్’ మ్యూజిక్ ఫెస్టివల్ జరిగింది. కాగా ఈ మ్యూజిక్ ఫెస్టివల్ లో విజయ దేవరకొండ, రష్మిక బంగారు వర్ణం డిజైనర్ డ్రెస్ లో ఆ జంట వేదికపై అద్భుతమైన డ్యాన్సింగ్ ట్రీట్ ఇచ్చింది. విజయ్ గోల్డ్ కలర్ లాల్చీలో కనిపిస్తే దానికి కాంబినేషన్ గా రష్మిక సైతం గ్రీన్ కలర్ బ్లౌజ్ కాంబినేషన్ కి గోల్డ్ కలర్ శారీలో ధరించి మైమరిపించింది. ఆ ఇద్దరూ వేదికపై ఒకరితో ఒకరు పోటీపడుతూ మాస్ స్టెప్పులతో రక్తి కట్టించారు. అక్కడికొచ్చిన అతిథులను, అభిమానులను అలరించారు. అంతేకాక ఈ ఈవెంట్ కు కన్నడ స్టార్ హీరో, కె.జి.ఎఫ్ హీరో యాష్ ముఖ్య అతిధిగా విచ్చేసి ఆ ఈవెంట్ కి అందాన్ని చేకూర్చారు. బెంగళూరు తరవాత చెన్నయ్.. హైదరాబాద్ లోనూ ఈ తరహా మ్యూజిక్ ఫెస్టివల్స్ ని టీమ్ ప్లాన్ చేస్తోంది.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.