(Local) Fri, 13 Dec, 2019

రవితేజ 'క్రాక్' పోస్టర్ అవుట్...

November 15, 2019,   1:58 PM IST
Share on:
రవితేజ 'క్రాక్' పోస్టర్ అవుట్...

స‌రస్వ‌తి ఫిలింస్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి.మ‌ధు నిర్మాత‌గా గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో టాలీవుడ్ మాస్ హీరో రవితేజ 66వ చిత్రం గురువారం హైద‌రాబాద్‌లో ఫిలిం నగర్ లో పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి అల్లు అరవింద్ మొద‌టి క్లాప్ నివ్వ‌గా, పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అలాగే ఫస్ట్ షాట్ ను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయగా.. దిల్ రాజు మరియు సురేందర్ రెడ్డి కలిసి, గోపీచంద్ మ‌లినేనికి స్క్రిప్ట్ ను అందజేసిన సంగతి తెలిసిందే. ఇందులో ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు....ఆయన పాత్ర చిత్రణకు తగ్గట్టే ‘క్రాక్‌’ అనే పేరు ఖరారు చేసి టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ రవితేజ, గోపీచంద్‌ మలినేని కాంబోలో వస్తున్న మూడో చిత్రమిది. ఇదివరకు చేసిన ‘డాన్‌శీను’, ‘బలుపు’ మంచి విజయాల్ని అందుకున్నాయి. తప్పకుండా ‘క్రాక్‌’తో హ్యాట్రిక్‌ కొడతారు. వచ్చే నెలలో షూటింగ్‌ మొదలెడతాం. 2020 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామ’’న్నారు. ఈ చిత్రంలో శృతి హాసన్, వరలక్ష్మి శరత్‌కుమార్‌, సముథ్రకని, దేవి ప్రసాద్‌, పూజిత పొన్నాడ తదితరులు నటిస్తున్నారు.  స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు.ఛాయాగ్రహణం: జి.కె.విష్ణు, మాటలు: బుర్రా సాయిమాధవ్‌.

Expression #8 of SELECT list is not in GROUP BY clause and contains nonaggregated column 'teluguda_entlnewsdb2018.c.slug' which is not functionally dependent on columns in GROUP BY clause; this is incompatible with sql_mode=only_full_group_by
సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.