(Local) Sat, 24 Aug, 2019

ప్ర‌ముఖ న‌టుడు స్వరూప్‌ దత్‌ ఆక‌స్మిక మ‌ర‌ణం..

July 18, 2019,   12:49 PM IST
Share on:

పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ నటుడు స్వరూప్‌ దత్‌ బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయస్సు 78 సంవత్సరాల కాగా వయోభారంతో బాధపడుతున్న స్వరూప్‌ శనివారం తన ఇంటి వద్ద ఆపస్మారక స్థితికి వెళ్లిపోయారు. దీంతో వెంటనే చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. స్వ‌రూప్ ద‌త్తా అంటే మ‌న ద‌గ్గ‌ర తెలియ‌క‌పోవ‌చ్చు కానీ బెంగాలి సినిమాలో మాత్రం ఆయ‌న అద్భుత‌మైన న‌టుడు. ఆయనకి  భార్య, ఒక కొడుకు ఉన్నారు. తనయుడు షరన్‌ దత్‌ కూడా నటుడే.

స్వరూప్‌ దత్‌ విభిన్నమైన పాత్రలు పోషించడంలో దిట్ట. పాత్ర ఏది ఇచ్చినా అలవోకగా ప్రేక్షకులను మెప్పించిన, 1968లో తపన సిన్హా దర్శకత్వంలో వచ్చిన 'అపంజన్‌' సినిమాతో చిత్రసీమలోకి అరంగేట్రం చేశారు. ఇతను ఉత్పల్‌ దత్‌ను స్ఫూర్తిగా పొంది నాటకాల్లో ప్రవేశించారు. చాలా కాలంపాటు ఆయన రంగస్థలం నటుడిగా కొనసాగారు. 'సగిన మహటో', 'హర్మోనియం', పితా పుత్ర అండ్‌ మా ఓ మేయే' వంటివి ఈయన చేసిన ప్రముఖ చిత్రాలుగా చెప్పవచ్చు. బెంగాల్‌ గొప్ప నటుల్లో ఈయనొకరుగా ప్రఖ్యాతి గడించారు. 60, 70 దశాల్లో ఈయన చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద కాసులు కురిపించాయి.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.