(Local) Wed, 16 Oct, 2019

‘ఖైదీ’ ట్రైలర్ విడుదల....

October 09, 2019,   1:13 PM IST
Share on:
‘ఖైదీ’ ట్రైలర్ విడుదల....

 డ్రీమ్ వారియర్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ కలిసి సంయుక్తంగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఖైదీ’. ఈ మూవీలో తమిళ హీరో కార్తిక్ శివకుమార్ హీరోగా నటిస్తున్నారు.  తాజాగా దసరా పండుగను పురస్కరించుకొని ‘ఖైదీ’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. కార్తీ రఫ్ అండ్ టఫ్ మాస్ క్యారెక్టర్‌లో అలరించనున్నాడు. దోపిడీలు, డ్రగ్స్ రవాణా మరియు హత్యల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్‌ చూస్తే సినిమా నేపథ్యం తెలుస్తుంది. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్‌కు కూడా మంచి స్పందన లభించింది. నరేన్, విజయ్ టివి దీనా, మరియమ్ జార్జ్ ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. దీపావళికి తమిళనాట ‘ఖైదీ’ భారీగా విడుదల కానుంది.
 

సంబంధిత వర్గం
అసురన్ లో ధనుష్ నటన....అద్భుతం
అసురన్ లో ధనుష్ నటన....అద్భుతం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.