(Local) Wed, 30 Sep, 2020

సంక్రాంతికి మొగుడు గా వస్తోంటున్న సూపర్ స్టార్...

November 22, 2019,   8:03 PM IST
Share on:
సంక్రాంతికి మొగుడు గా వస్తోంటున్న సూపర్ స్టార్...

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం  'సరిలేరు నీకెవ్వరు'. ఈ చిత్రంలో సూపర్ స్టార్ సరసన రష్మిక హీరోయిన్ కాగా....లేడీ సూపర్ స్టార్ విజయశాంతి,ప్రకాష్‌రాజ్‌, రాజేంద్రప్రసాద్‌,  సంగీత, బండ్ల గణేష్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్‌ 23 యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి పుట్టినరోజు. ఆయనకు బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తూ నవంబర్‌ 22న ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ను విడుదల చేశారు. మిలటరీ బ్యాక్‌డ్రాప్‌తో మహేష్‌బాబు వాయిస్‌ ఓవర్‌తో ఈ టీజర్‌ ప్రారంభమవుతుంది. 
టీజర్ లో.... ‘మీరెవరో మాకు తెలీదు.. మీకు మాకు ఎలాంటి రక్త సంబంధం లేదు.. కానీ మీకోసం మీ పిల్లలకోసం పగలు,రాత్రి,ఎండ, వాన అని లేకుండా పోరాడుతూనే ఉంటాం.. ఎందుకంటే మీరు మా బాధ్యత’ అంటూ మహేష్ చెప్పే డైలాగ్ తో టీజర్ ఇన్‌స్పైరింగ్‌గా ఉంటాయి. ‘మీరంతా నేను కాపాడుకునే ప్రాణాలు రా.. మిమ్మల్నెలా చంపుకుంటాను రా.. మీకోసం ప్రణాలిస్తున్నాం రా అక్కడ.. మీరేమో కత్తులు, గొడ్డళ్లు ఏసుకుని ఆడాళ్ళ మీద.. బాధ్యత ఉండనక్కర్లా..? అంటూ అజయ్ కు మహేష్ క్లాస్ పీకుతూ చెప్పే డైలాగ్ పీక్స్ లో ఉంది. ఆ తర్వాత ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌లో ‘భయపడే వాడే బేరానికొస్తాడు.. మనదగ్గర బేరాల్లేవమ్మా..’ అంటూ లౌడ్‌గా చెప్పే డైలాగ్‌ మహేష్‌ క్యారెక్టర్‌లోని ఎమోషన్‌ని తెలియజేస్తుంది. లేడీ అమితాబ్‌ విజయశాంతి హీరో క్యారెక్టర్‌ గురించి చెప్తూ ‘గాయం విలువ తెలిసినవాడే సాయం చేస్తాడు బాబాయ్‌’ అంటూ హీరో ఔనత్యాన్ని తెలియజేస్తుంది. టీజర్‌ ఎండింగ్‌లో ఇరిటేషన్‌లో ఉన్న ప్రకాష్‌రాజ్‌ ‘ప్రతి స్రంకాంతికి అల్లుళ్లొస్తారు… ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు’ అంటూ చెప్పే డైలాగ్‌ ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తుంది.  మొత్తానికి ఈ టీజర్‌లో అన్నిరకాల ఎలిమెంట్స్‌ ఉండేలా ఎంతో కేర్‌ తీసుకున్నారనేది అర్థమవుతుంది. ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతాయి. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.
 

సంబంధిత వర్గం
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...
ప్రారంభమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.