(Local) Fri, 19 Jul, 2019

ఆర్‌టిసి క్రాస్ రోడ్స్‌లో సంద‌డి చేయ‌నున్న మ‌హేష్‌

May 14, 2019,   2:15 PM IST
Share on:

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ‘మ‌హర్షి’ చిత్రంతో భారీ విజ‌యాన్ని అందుకున్నాడు. వంశీ పైడిప‌ల్లి డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మ‌హ‌ర్షి చిత్రం కేవ‌లం నాలుగు రోజుల‌లోనే 100 కోట్లు రాబ‌ట్టి అందరిని మంత్ర ముగ్దులను చేసింది. త‌న సిన్మాని సీని ప్రియులకు మ‌రింత‌గా చేరువ చేయడానికి మ‌హేష్ చాలా కృషి చేస్తున్నాడు.  ప్రిన్స్ మహేష్ బుధవారం సాయంత్రం 6 గంట‌ల‌కి ఆర్‌టిసి క్రాస్ రోడ్స్ లోని సుద‌ర్శ‌న్ 35ఎంఎం థియేట‌ర్‌లో జ‌ర‌గ‌బోతున్న స‌క్సెస్ మీట్ లో పాల్గొన‌నున్నాడు.

ఇందుకు థియేట‌ర్ యాజ‌మాన్యం భారీ ఏర్పాట్లు చేస్తుంది. మ‌హేష్ న‌టించిన పలు చిత్రాలు సుద‌ర్శ‌న్ 35 ఎంఎంలో ప్ర‌ద‌ర్శింప‌బ‌డి భారీ రికార్డులను క్రియేట్ చేశాయి. తాజాగా వచ్చిన మహేష్ మ‌హ‌ర్షి సిన్మా కూడా ఈ థియేట‌ర్‌లో స‌క్సెస్ ఫుల్‌గా నడుస్తుంది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన మ‌హ‌ర్షి చిత్రంలో మ‌హేష్ బాబు, అల్లరి న‌రేష్‌, పూజా హెగ్డే కీలక పాత్ర‌లు పోషించారు.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.