(Local) Thu, 06 May, 2021

మలేషియా విద్యాశాఖ మంత్రి ని మెప్పించిన 'రాట్చాసి'...

September 04, 2019,   5:20 PM IST
Share on:
మలేషియా విద్యాశాఖ మంత్రి ని మెప్పించిన 'రాట్చాసి'. ...

ఒక‌ప్పుడు గ్లామ‌ర్ హీరోయిన్‌గా అల‌రించిన జ్యోతిక హీరో సూర్యని పెళ్లి చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కి దూరంగా ఉంది. మళ్ళీ ఆ తర్వాత సెకండ్ ఇన్డింగ్స్ మొదలుపెట్టి 36 వయోదినిలే చిత్రంతో వెండితెరకి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌స్తుతం జ్యోతిక  సెల‌క్టివ్ సినిమాలు చేస్తూ  బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది. ఇటీవ‌ల జ్యోతిక 'రాట్చాసి'  అనే సినిమాలో పాఠ‌శాల ప్రిన్సిప‌ల్ ఆఫీస‌ర్ పాత్ర చేసింది. గౌత‌మ్ రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో భారతదేశంలోని పేద విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను చూపించారు. ఈ చిత్రాన్ని రీసెంట్‌గా మ‌లేషియా విద్యాశాఖ మంత్రి మాస్లీ మాలిక్ వీక్షించారు. సినిమాపై ప్ర‌శంస‌లు కురిపిస్తూ ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ చిత్రాన్ని చూడాలని అన్నారు. విద్యావ్యవస్థలో మార్పులను తీసుకురావడానికి మేకర్స్ ప్రదర్శించిన అనేక అంశాలను ఆయన చ‌ర్చించారు. 
 

సంబంధిత వర్గం
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...
రేపే కార్తి ‘దొంగ’ ఆడియో ఫంక్షన్...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.