(Local) Mon, 20 May, 2019

పోర్చుగల్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ‘మన్మథుడు 2’

May 14, 2019,   2:17 PM IST
Share on:

నాగార్జున హీరోగా నటిస్తున్న ‘మన్మథుడు 2’ చిత్రం పోర్చుగల్ షెడ్యూల్ పూర్తయింది. ఓ నెల రోజుల పాటుగా లిస్బన్, పోర్టొ నగరాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఈ షెడ్యూల్‌లో నాగార్జున, రకుల్‌ప్రీత్ సింగ్‌తో పాటు వెన్నెల కిషోర్, రావు రమేష్ సహా పలువురు నటులు పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మన్మథుడు ఇన్‌స్పిరేషన్‌తో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ ఫన్ రైడర్ మూవీ తెరకెక్కుతోంది. మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః ఎం.సుకుమార్, మ్యూజిక్‌ః చైతన్య భరద్వాజ్, స్క్రీన్‌ప్లేః రాహుల్ రవీంద్రన్, సత్యానంద్, ఎడిటర్స్‌ః ఛోటా కె.ప్రసాద్, బి.నాగేశ్వర రెడ్డి, డైలాగ్స్‌ః కిట్టు విస్సా ప్రగడ, రాహుల్ రవీంద్రన్.

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.