(Local) Tue, 20 Aug, 2019

‘మన్మథుడు 2’ టీజర్‌ ఈనెల 13న విడుదల

June 11, 2019,   7:11 PM IST
Share on:

లవ్ బర్డ్స్ అయినా అక్కినేని నాగార్జున, అక్కినేని  అమల 1992, జూన్ 11న వివాహం చేసుకుని ఈ నాటికీ 27 సంవత్సరాలు పూర్తీ అయింది. అప్పటి నుండి ఆ జంట అందరికి కనులవిందుగా కనిపిస్తూనే ఉన్నారు. ఈ రోజు వారి పెళ్లి రోజు కావడంతో అభిమానులు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఆ రొమాంటిక్ జంటకు విషెస్ చెబుతున్నారు. ఈ కోవలో అభిమానులే కాకుండా సెలెబ్రెటీస్ కూడా తమ విషెస్ ను తెలియజేస్తున్నారు. అయితే కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతోన్న ‘మన్మథుడు 2’ చిత్రం మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా నాగార్జునతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ప్రేక్షకులతో పంచుకుంటూ వస్తున్నారు. ఈ ఫొటోలతో ఇప్పటికే ‘మన్మథుడు 2’కి బోలెడంత ప్రచారం వచ్చేసింది. సినిమాపై ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలను మరింత పెంచేందుకు చిత్ర టీజర్‌ను ఈనెల 13న టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ పనిలో పనిగా నాగార్జున, అమలలకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. 
 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.