(Local) Mon, 16 Sep, 2019

తన బ్రేకప్ పై స్పందించిన మెగా హీరో

September 10, 2019,   3:57 PM IST
Views: 37
Share on:
తన బ్రేకప్ పై స్పందించిన మెగా హీరో

సోషల్ మీడియా అనేది వచ్చాక సెలబ్రిటీస్ సంబందించిన చిన్న విషయం కూడా అందరికి తెలిసిపోవడమే కాకుండా ఆ విషయాలు సోషల్ మాధ్యమాలలో చక్కర్లు కొడుతుండటం చూస్తూనే ఉంటాం. అదే సినీ పరిశ్రమలో అయితే హీరోలు, హీరోయిన్లు సన్నిహితంగా ఉన్న, ఎక్కడైనా కలిసి కనిపించిన వారిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతుందని వార్తలు ఇంకా కాస్త ఎక్కువుగా ట్రెండ్ అవుతుంటాయి. కాగా తాజాగా ఓ హీరో పర్సనల్ లైఫ్ మీదే దృష్టి పడింది. ఆ హీరో ఎవరో కాదు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ఈ మెగా హీరో మారుతి దర్శకత్వంలో “ప్రతిరోజు పండగే” సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే హీరో సాయి ధరమ్ తేజ్ పై  ప్రేమ, బ్రేకప్ లాంటి వార్త ఒకటి హల చల్ చేస్తోంది. ఈ క్రమంలో ఈ మెగా హీరో తన పర్సనల్ లైఫ్ గురించి అభిమానులతో పంచుకున్నారు. తాజాగా తన ప్రేమ, బ్రేకప్ విషయాలపై స్పందిస్తూ తన లైఫ్ లో ఓ అమ్మాయి ఉండేదని కానీ తనకు దూరమైందని చెప్పుకొచ్చాడు. కాలేజ్ డేస్ లో తేజ్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడట. తనకు సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. కాలేజ్ పూర్తయిన తరువాత సాయి ధరమ్ తేజ్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఐదేళ్ల సమయం పట్టింది. ఆ సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ తో దూరం పెరిగిందని చెప్పుకొచ్చాడు. బ్రేకప్ జరగడానికి సరైన కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇక ఇండస్ట్రీలో వినిపించే రూమర్స్ పై స్పందిస్తూ..’నేను చాలా మంది హీరోయిన్లతో సన్నిహితంగా ఉంటాను. దాని కారణంగా డేటింగ్ రూమర్లు వస్తున్నాయి. కానీ వారంతా నాకు మంచి ఫ్రెండ్స్ మాత్రమే’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సాయి ధరం తేజ్ ఇంట్లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారట. కానీ తను సెటిల్ అయిన తరువాతే పెళ్లి చేసుకుంటానని తన తల్లికి చెప్పారట.

సంబంధిత వర్గం
ప్రీ లుక్ తో ‘ప్రతి రోజు పండగే’ !
ప్రీ లుక్ తో ‘ప్రతి రోజు పండగే’ !

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.