(Local) Sun, 26 Jan, 2020

నిఖిల్‌ కోసం వస్తున్న మెగాస్టార్...

November 25, 2019,   5:59 PM IST
Share on:
నిఖిల్‌ కోసం వస్తున్న మెగాస్టార్...

మొత్తానికి హీరో నిఖిల్ నటించిన `అర్జున్ సుర‌వ‌రం' విడుదలకి సిద్దమైంది. న‌వంబ‌ర్ 29న విడుదలకి రెడీ అవుతున్న తరుణంలో ఈ  న‌వంబ‌ర్ 26న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను పీపుల్స్ ప్లాజాలో నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా నిఖిల్ మాట్లాడుతూ “ఓ క్రేజీ విష‌యం జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవిగారిని ఇప్పుడే క‌లుసుకున్నాం. ఆ అనుభూతి చాలా గొప్ప‌గా అనిపించింది. మా `అర్జున్ సుర‌వ‌రం` సినిమాను చూసి ఆయ‌న మ‌మ్మ‌ల్ని ఆయ‌న ఇంటికి పిలిచి మాట్లాడారు. ఆయ‌న‌కు సినిమా బాగా న‌చ్చింది. మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయ‌న ముఖ్య అతిథిగా వ‌స్తాన‌ని అన్నారు. మా యూనిట్ అంద‌రికీ ఇది చాలా పెద్ద విష‌యం. చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. పీపుల్స్ ప్లాజాలో ఈ నెల 26న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హిస్తున్నాం“ అన్నారు.

న‌కిలీ స‌ర్టిఫికేట్స్ కుంభ‌కోణంలో అర్జున్ సుర‌వ‌రం అనే ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్ అరెస్ట్ అవుతాడు. ఆ కేసును ఆ జ‌ర్న‌లిస్ట్ ఎలా చేధించాడ‌నేదే ఈ సినిమా క‌థ‌. ప్ర‌ముఖ నిర్మాత ఠాగూర్ మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మాత‌గా టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. ఈ చిత్రంలో నిఖిల్ సరసన లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా కనిపించబోతోంది. పోసాని కృష్ణ‌ముర‌ళి, సత్య‌, త‌రుణ్ అరోరా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ఈ సినిమా పోస్ట‌ర్స్‌కు, టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. 

సంబంధిత వర్గం
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
యాక్షన్ పోస్టర్ లో ‘అశ్వథ్థామ’గా నాగ శౌర్య
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...
డిసెంబర్ లో వస్తున్నా 'దొంగ'...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.