(Local) Mon, 21 Oct, 2019

మెగాస్టార్ కి నో చెప్పిన తెలంగాణ మంత్రి...

September 14, 2019,   1:03 PM IST
Share on:
మెగాస్టార్ కి నో చెప్పిన తెలంగాణ మంత్రి...

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార నటించిన ప్రతిష్టాత్మక చిత్రం "సైరా". అత్యంత భారీ బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానున్న నేపథ్యంలో ఈ నెల 18న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో సైరా మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్‌ జరగనుంది. రేనాటి సూర్యుడు తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో అందుకు తగ్గట్లే ఎల్‌బీ స్టేడియంలో భారీ సెట్‌ వేసేందుకు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సన్నాహాలు చేస్తుంది. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కొందరు ప్రముఖులు విచ్చేయనున్న సంగతి స్వయంగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్విట్ చేస్తూ స్పష్టత ఇచ్చింది. తెలంగాణ మంత్రి కేటీఆర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, దర్శకులు రాజమౌళి, శివ కొరటాల, వివి వినాయక్ ముఖ్య అతిథులగా హాజరవుతారని తెలిపింది. ఐతే ఈ ప్రకటన చేసిన కాసేపటికే మరో ప్రకటన చేశారు. సైరా ప్రిరిలీజ్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరుకావడం లేదని వెల్లడించారు. ముందుగానే నిర్ణయించబడిన ప్రభుత్వ అధికార కార్యక్రమాలకు వెళ్లాల్సిన ఉన్నందున ఆయన రావడం లేదని తెలిపారు. ఈ సైరా మూవీలో మెగాస్టార్ తో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, అనుష్క, తమన్నా నటిస్తున్నారు. అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది.

సంబంధిత వర్గం
‘మోదీ' ని టార్గెట్ చేసిన ఉపాసన రామ్ చరణ్..
‘మోదీ' ని టార్గెట్ చేసిన ఉపాసన రామ్ చరణ్..

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.