(Local) Sat, 24 Aug, 2019

సాంప్రదాయక వస్త్రధారణలో మోహన్ లాల్

June 10, 2019,   6:59 PM IST
Share on:

ప్రముఖ సినీ నటుడు మోహన్ లాల్ కేరళ గురువాయూర్‌లోని శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకున్నారు. సాంప్రదాయక వస్త్రధారణలో 
 ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోహన్ లాల్ రాకతో ఆలయం వద్ద సందడి నెలకొంది. తన అభిమాన స్టార్‌ను చూసేందుకు ఆయన అభిమానులు, భక్తులు పోటీపడ్డారు.ప్రధాని నరేంద్ర మోదీ గురువాయూర్ ఆలయాన్ని శనివారంనాడు దర్శించుకోవడం తెలిసిందే. మోహన్ లాల్ మరుసటి రోజు స్వామివారిని దర్శించుకున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు అగ్ర సెలబ్రిటీలు ఆలయాన్ని దర్శించుకోవడం విశేషం.
గురువాయూర్ ఆలయాన్ని దర్శించుకున్న మోహన్ లాల్...సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తన అభిమానులతో ఆనందంగా పంచుకున్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.