(Local) Mon, 16 Sep, 2019

ఓణం శుభాకాంక్ష‌లు తెలియజేస్తున్న మలయాళ స్టార్....

September 11, 2019,   2:09 PM IST
Views: 27
Share on:
ఓణం శుభాకాంక్ష‌లు తెలియజేస్తున్న మలయాళ స్టార్....

దక్షిణ భారతదేశ రాష్ట్రమైన కేరళలో అతిపెద్ద పండుగ ఓణం. ఇది మలయాళీ క్యాలెండరులో మొదటి నెల అయిన చింగంలో (ఆగష్టు–సెప్టెంబర్) వస్తుంది. కేర‌ళ ఆచార సంప్ర‌దాయాల ప్ర‌కారం ఈ పండుగను ప‌ది రోజుల పాటు జ‌రుపుకుంటారు. ప్రతి ఏటా ఈ పండుగను మలయాళీ సెలెబ్రిటీస్ కూడా ఘనంగా నిర్వహించడం చూస్తూనే ఉన్నాం.

ఈ రోజు ఓణం పండుగను పురస్కరించుకొని మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్ లాల్ ఓ వీడియో ద్వారా అందరికి ఓణం పండుగ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అంద‌రు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాల‌ని ఆయ‌న కోరారు. ప్రజలను సమానంగా చూస్తూ, వారు సంతోషంగా ఉండేలా పూర్వం కేరళ రాష్ట్రాన్ని పాలించిన రాజు మహాబలి గౌరవార్థం కేర‌ళ రాష్ట్ర ప్రజలు ప్రతి ఏడాది ఓనం పండుగను ఎంతో ఘ‌నంగా జరుపుకుంటూ ఉంటారు.  

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.