(Local) Sat, 23 Oct, 2021

బాలయ్య సినిమాతో మోక్షు ఎంట్రీ..?

October 31, 2019,   4:45 PM IST
Share on:
బాలయ్య సినిమాతో మోక్షు ఎంట్రీ..?

నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో 'రూలర్' గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే ఈ చిత్రం నుండి బాలయ్య స్టయిష్ లుక్ తో పాటు పోలీస్ లుక్ కూడా విడుదలైనాయి. బాలయ్య అభిమానులు అయన సినిమా కోసం ఎంతగా వేచిచుస్తుంటారో అదే విధంగా బాలయ్య బాబు తనయుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి కూడా అలాగే ఎదురుచూస్తున్నారు.

ఇకపోతే ఎప్పటినుండో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీపై వార్తలొస్తున్నాయి. 2018 లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య హింట్ ఇచ్చినా.. మోక్షజ్ఞ ఎంట్రీ జరగలేదు. ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడా..? అని నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ ఇప్పుడు సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, అది కూడా బోయపాటి - బాలయ్య సినిమా ద్వారా అని తెలుస్తుంది. అయితే ఈ న్యూస్ లో నిజమెంతుందో తెలియదు కానీ... బోయపాటి, మోక్షజ్ఞ పాత్రని ఎలా డిజైన్ చేస్తాడు? అసలు సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ ఎలా ఉంటుందో? అంటూ అభిమానులు అప్పుడే హాట్ హాట్ చర్చలకు తెర లేపారు. 

సంబంధిత వర్గం
డిసెంబ‌ర్ 20న వస్తున్న `రూల‌ర్‌`...
డిసెంబ‌ర్ 20న వస్తున్న `రూల‌ర్‌`...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.