(Local) Mon, 09 Dec, 2019

డిసెంబ‌ర్ 20న వస్తున్న `రూల‌ర్‌`...

November 29, 2019,   7:41 PM IST
Share on:
డిసెంబ‌ర్ 20న వస్తున్న `రూల‌ర్‌`...

కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ 105వ చిత్రం ‘రూలర్’  తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ సినిమాను డిసెంబ‌ర్ 20న  ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్లుగా అధికారికంగా ప్రకటించారు. మ‌రోవైపు ప్ర‌మోష‌న్ల‌ను కూడా భారీగా చేయ‌డానికి చిత్ర‌బృందం స‌న్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా చిరంత‌న్ భ‌ట్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాట‌ల లిరిక‌ల్ వీడియోల‌ను త్వ‌ర‌లోనే విడుద‌ల చేయ‌నున్నారు.  మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో బాల‌కృష్ణ రెండు శ‌క్తిమంత‌మైన పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు.  జై సింహా వంటి సూప‌ర్‌హిట్ చిత్రం త‌ర్వాత బాల‌కృష్ణ‌, కె.ఎస్‌.ర‌వికుమార్ కాంబినేష‌న్‌లో రాబోతున్న చిత్రం కావ‌డంతో రూల‌ర్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన బాల‌కృష్ణ లుక్స్, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్ర‌కాశ్‌రాజ్‌, భూమిక‌, జ‌య‌సుధ‌, షాయాజీ షిండే, ధ‌న్‌రాజ్‌, కారుమంచి ర‌ఘు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులు. రామ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత వర్గం
వైరల్ అవుతున్న బాలయ్య పార్టీ డ్యాన్స్...
వైరల్ అవుతున్న బాలయ్య పార్టీ డ్యాన్స్...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.