(Local) Sun, 17 Nov, 2019

సంక్రాంతికి వస్తున్న 'ఎంత మంచివాడవురా'

November 08, 2019,   2:03 PM IST
Share on:
సంక్రాంతికి వస్తున్న 'ఎంత మంచివాడవురా'

ఆదిత్య మ్యూజిక్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో వస్తున్న ఈ మూవీని ఉమేష్ గుప్త, సుభాష్‌ గుప్త నిర్మాణంలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'ఎంత మంచివాడవురా'. శతమానం భవతి సినిమాతో ట్రేడ్ మార్క్ హిట్ కొట్టిన దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ కు జోడిగా మెహ్రీన్‌ నటిస్తోంది. మూవీ రిలీజ్ డేట్ పై చిత్ర యూనిట్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చింది. ఈ ఫ్యామిలీ డ్రామాను జనవరి 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్లు కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు.ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ అప్పుడపుడు రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ తో సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల హీరోయిన్ నటశా దోషి – కళ్యాణ్ రామ్ మధ్య సాంగ్ ని చిత్రీకరించిన చిత్ర యూనిట్ రాజమండ్రి – గొదావరి పరిసర ప్రాంతాల్లో కళ్యాణ్ రామ్ విలన్ల మధ్య ఒక షెడ్యూల్ ని పూర్తి చేసింది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.కుటుంబ విలువలు, బంధాలకు పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాతలు తెలిపారు.

సంబంధిత వర్గం
‘ఎంత మంచివాడవురా’ టీజర్ రిలీజ్...
‘ఎంత మంచివాడవురా’ టీజర్ రిలీజ్...

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.