(Local) Mon, 06 Apr, 2020

'ఎంత మంచివాడవురా' టీజర్ అప్డేట్....

October 07, 2019,   7:08 PM IST
Share on:
'ఎంత మంచివాడవురా' టీజర్ అప్డేట్....

నందమూరి ఫాన్స్ కి  దసరా కానుకగా బాలయ్య బాబు న్యూ పోస్టర్ తో విష్ చేయగా..తాజాగా నందమూరి అబ్బాయి టీజర్ తో రేపు విష్ చేస్తానంటూ నందమూరి కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు. డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నెక్స్ట్ అన్ని వర్గాల ప్రేక్షకులకు మెప్పించేవిధంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో సిద్ధమవుతున్నాడు. సతిష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న ఎంత మంచివాడవురా! సినిమా సంక్రాంతికి విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇక సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలియజేసాడు. ఎంత మంచివాడవురా సినిమా టీజర్ ను ఈ నెల 9న ఉదయం 9గంటలకు విడుదల చేయానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ఆదిత్య మ్యూజిక్ అధికారికంగా తెలియజేసింది. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ తో టైటిల్ తో ఆకట్టుకున్న చిత్ర యూనిట్ ఇప్పుడు టీజర్ తో ఎట్రాక్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది. మెహ్రీన్ పీర్జాద హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత వర్గం
సంక్రాంతికి వస్తున్న 'ఎంత మంచివాడవురా'
సంక్రాంతికి వస్తున్న 'ఎంత మంచివాడవురా'
రివ్యూ: చాణక్య
రివ్యూ: చాణక్య

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.