(Local) Mon, 16 Sep, 2019

వైజాగ్‌లో.. గ్యాంగ్ లీడ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్

September 10, 2019,   3:25 PM IST
Views: 30
Share on:
వైజాగ్‌లో.. గ్యాంగ్ లీడ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్

నాచురల్ స్టార్ నాని హీరోగా విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం "గ్యాంగ్ లీడ‌ర్". మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఓ చిన్నారితో పాటు నలుగురు ఆడవాళ్ళకి లీడర్ గా పెన్సిల్ పార్ధ‌సార‌ధి పాత్రలో నాని నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆర్ ఎక్స్ 100 మూవీ హీరో కార్తికేయ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. కాగా ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండంతో మూవీ ప్రమేషన్స్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా సాగుతున్నాయి. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఫిక్స్ చేశారు. వైజాగ్‌లోని గురుజాడ క‌ళాక్షేత్రంలో ఈ వేడుక జ‌ర‌గ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈరోజు సాయంత్రం 6గం.ల నుండి కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని పోస్ట‌ర్‌లో తెలిపారు. ఈ చిత్రంలో ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందించారు. 

సంబంధిత వర్గం
మరో కొత్త చిత్రానికి సైన్ చేసిన నాచురల్ స్టార్....
మరో కొత్త చిత్రానికి సైన్ చేసిన నాచురల్ స్టార్....
గ్యాంగ్ తో శ్రీవారిని దర్శించుకున్న నాని....
గ్యాంగ్ తో శ్రీవారిని దర్శించుకున్న నాని....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.