(Local) Fri, 06 Dec, 2019

‘బికినీ స్టార్’ గా మరీనా పొడుగుకాళ్ల సుందరి......

August 13, 2019,   11:38 AM IST
Share on:
‘బికినీ స్టార్’ గా మరీనా పొడుగుకాళ్ల సుందరి......

వెండితెరమీద కొందరు నటీమణులు ఇలా వచ్చి ఆలా మాయమవుతుంటారు. అలాంటి ఓ నటీమణులలో శుభ్ర అయ్యప్ప ఒకరు. 2014లో నారా రోహిత్ హీరోగా నటించిన ప్రతినిధి సినిమాలో జర్నలిస్టు పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత తమిళ్, కన్నడ బాషలలో సినిమాలో నటించినప్పటికీ ఈ అమ్మడికి సరయిన ఆఫర్స్ అందడంలేదనే చెప్పుకోవచ్చు. వెండితెరమీద కనిపించకపోయినా ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం బాగానే ఆక్టివ్ గా ఉంటూ తనకి సంబందించిన ప్రతి విషయాన్ని పంచుకుంటూనే ఉంటోంది.

తాజాగా ఈ కన్నడ అమ్మడు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో బికినీ ధరించిన ఓ ఫోటో షేర్ చేసి సందడి చేస్తోంది. ఈ ఫోటోకు “గురుత్వాకర్షణ శక్తి కాస్త భిన్నంగా ఉండే ఒక గ్రహానికి వచ్చాను #హెవెన్ ఆన్ ఎర్త్” అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది. నిజంగానే ఫోటోలో ఉన్న లొకేషన్ అదిరిపోయింది.  చుట్టూ నీళ్ళు… నేపథ్యంలో పచ్చటి చెట్లు.. వాటి మధ్యలో అక్కడక్కడా ఇళ్ళు.. ఫోన్ సిగ్నల్స్ ఉండే అవకాశం కనిపించడం లేదు కానీ ఇంతకంటే బెస్ట్ లొకేషన్ ఏముంటుంది చెప్పండి..  ప్రింటెడ్ బికినీ ధరించి ఒక బోటుపై కూర్చొని అందమైన ప్రకృతిని తనివితీరా అస్వాదిస్తున్నట్టుగా ఒక అందమైన నవ్వు నవ్వింది. పోనీ టెయిల్.. నయనాలకు కూలింగ్ గ్లాస్సెస్  ధరించి నెటిజన్లను మెస్మరైజ్ చేసింది. బికినీ కాబట్టి అందాల విందు పీక్స్ లో ఉంది.  నెటిజన్లు ఈ ఫోటో దెబ్బకు పిచ్చెక్కిపోయి మరీ కామెంట్లు పెట్టారు.  ఒక నెటిజన్ ఏకంగా శుభ్రను ‘బికినీ స్టార్’ అంటూ కితాబిచ్చాడు. “మాటల్లేవ్.. స్టన్నింగ్ ప్రిన్సెస్”.. “అవును అక్కడ గురుత్వాకర్షణ లేదు.. శుభ్రాకర్షణ ఉంది”  అంటూ మరి కొందరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.