(Local) Wed, 08 Jul, 2020

ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఎంపికలో ఉత్తమ లఘు చిత్రం...

November 16, 2019,   5:31 PM IST
Share on:
ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఎంపికలో ఉత్తమ లఘు చిత్రం...

న్యూఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘం గురువారం నాడు మానవ హక్కుల రక్షణ, ప్రచారానికి సంబంధించిన అవగాహనను సృజనాత్మకంగా తెలియజెప్పే లఘు చిత్రాలకు పురస్కారాలు ప్రకటించింది. 2018 సంవత్సరానికి మొత్తం 88 లఘు చిత్రాలు  పోటీపడగా వీటిలో మూడింటిని ఎంపిక చేసింది. అత్యాచారానికి గురైన బాలుడు, అతని కుటుంబం న్యాయం పొందేందుకు చేసే ప్రయత్నం ఇతివృత్తంగా తీసిన 'కుంభిల్‌ శివ తొలి ఉత్తమ పురస్కారానికి ఎంపికైంది. లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తి పోలీసు అధికారిగా మారేందుకు చేసిన పోరాటం ఇతివృత్తంగా తీసిన 'ట్రాన్స్‌జెండర్‌' చిత్రానికి ద్వితీయ ఉత్తమ పురస్కారం లభించింది. విధ్వంసకర అభివృద్ధితో సహజ పరిసరాలను కోల్పోయిన వృద్ధుని కథ 'గల్ప్‌' చిత్తానికి మూడో ఉత్తమ అవార్డు దక్కింది. ఈ చిత్రాలకు డిసెంబరు 10న పురస్కారాలు అందజేస్తారు. టు లెట్‌, ఏ డైయింగ్‌ విష్‌, నిమా, డూ స్పైట్‌ హియర్‌ చిత్రాలకు ప్రత్యేక ప్రస్తావన సర్టిఫికెట్లు కూడా అందజేయనున్నారు.

సంబంధిత వర్గం

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.