(Local) Sat, 24 Aug, 2019

లిప్‌లాక్‌కు అందుకే అంగీకరించా : నికిషాపటేల్‌

July 18, 2019,   1:28 PM IST
Share on:

నికిషాపటేల్‌ టాలీవుడ్‌లో పవర్ స్టార్ పక్కన కొమరం పులి చిత్రం ద్వారా పరిచయమైన ఈ గుజరాతీ బ్యూటీ.  ఆ తరువాత కోలీవుడ్‌లో ఎన్నమో ఏదో’ చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులకి  పరిచయమైంది. అనంతరం ‘తలైవన్‌’, ‘కరైయోరం’, ‘నారదన్‌’, ‘7నాట్కల్‌’, ‘తదితర చిత్రాల్లో నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది. తాజాగా ఆరవ్‌కు జోడీగా ‘మార్కెట్‌రాజా ఎంబీబీఎస్‌’లో నటిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఓ పాటను కూడా తెరకెక్కించారు. ఓ లిప్‌లాక్‌ సన్నివేశాన్ని దర్శకుడు ఇటీవల వివరిస్తే ఆరంభంలో నికిషాపటేల్‌ నిరాకరించింది. ఆ తర్వాత ఆ సన్నివేశం ప్రాముఖ్యత గురించి దర్శకుడు చెప్పడంతో వెంటనే అంగీకారం తెలిసింది. ఆ మేరకు సన్నివేశంలో నటించింది కూడా. దీని గురించి నికిషా స్పందిస్తూ... ‘‘ సినిమాలో చాలా ముఖ్యమైన సన్నివేశం అది. అందువల్లే అంగీకరించాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ సన్నివేశాన్ని చూసేటప్పుడు ప్రేక్షకులకు ఎబ్బెట్టుగా ఉండదు. సినిమాలపై ఉన్న ఆసక్తితోనే ఇక్కడి వచ్ఛా మంచి నాయికగా గుర్తింపు తెచ్చుకునేంత వరకు ప్రయత్నిస్తుంటా. తప్పకుండా ఏదో ఒక రోజు నేను అనుకునే గుర్తింపు వస్తుందని’’ పేర్కొన్నారు

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.