(Local) Wed, 16 Oct, 2019

ప్రారంభమైన ‘రంగ్ దే’ చిత్రం...

October 08, 2019,   11:50 PM IST
Share on:
ప్రారంభమైన ‘రంగ్ దే’ చిత్రం...

సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌ సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరొయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘రంగ్ దే’. విజయదశమి పండుగను పురస్కరించుకొని ఈ మూవీ ప్రారంభమయింది. నితిన్, కీర్తిసురేష్‌లపై డైరెక్టర్ త్రివిక్రమ్ గారు క్లాప్ నిచ్చారు. ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి మహేంద్ర కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా జెమిని కిరణ్,సుధాకర్ రెడ్డి, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు. ప్రేమతో కూడిన కుటుంబ కథాచిత్రమిది. పి.సి.శ్రీరామ్ గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తుండటం సంతోషంగా ఉంది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కూడా కంటిన్యూగా జరుగుతుంది, 2020 వేసవి కానుకగా చిత్రం విడుదల అవుతుందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.

సంబంధిత వర్గం
13నెలల చిన్నారికి గుండె ఆపరేషన్....మనసున్న మారాజు
13నెలల చిన్నారికి గుండె ఆపరేషన్....మనసున్న మారాజు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.