(Local) Mon, 17 Jun, 2019

సేల్స్ గర్ల్ గా మారిన నటి నారా ఫ‌తేహి!

June 11, 2019,   12:51 PM IST
Share on:

బాహుబలి ఫస్ట్ పార్ట్ లో  'మనోహరి' స్పెషల్ సాంగ్ కి చిందులేసిన ఇండో కెన‌డియ‌న్ బ్యూటీ నారా ఫ‌తేహి. ఆ తరువాత తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించింది. ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ 'భారత్' సినిమాలో ఈ బ్యూటీ కనిపించింది. ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు గాని. సోషల్ మీడియాలో మాత్రం ఫొటోలతో వీడియోలతో రచ్చ చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ భామ  బ్యాంకాక్ లో సేల్స్ గర్ల్ గా మారి బట్టలు అమ్ముతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ లో మంచి డాన్సర్ గా పేరు తెచ్చుకున్న ఈ భామ బ్యాంకాక్ మార్కెట్ లో నేల మీద కూర్చొని బట్టలు అమ్ముతోంది. ఈ వీడియోలో ఆమె ఎలాంటి మేకప్ లేకుండా అచ్చం సేల్స్ గర్ల్ మాదిరిగానే ఉంది. తన కస్టమర్లతో స్థానిక భాషలో మాట్లాడుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'స్ట్రీట్ డాన్సర్' అనే సినిమాలో నటిస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

సంబంధిత వార్తలు

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.