(Local) Thu, 05 Dec, 2019

"ఓ బావా" సాంగ్ ప్రోమో...

November 16, 2019,   6:49 PM IST
Share on:

యూవీ క్రియోషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాణంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా, అందాల భామ రాఖి ఖ‌న్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం “ప్రతి రోజూ పండగే”. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న షూటింగ్ రీసెంట్‌గా పూర్తైంది. వీలైనంత త్వ‌ర‌గా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ని పూర్తి చేసి డిసెంబ‌ర్ 20న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌మోష‌న్‌లో భాగంగా చిత్రానికి సంబంధించిన సాంగ్స్ ఒక్కొక్కటిగా విడుద‌ల చేస్తున్నారు. టైటిల్ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ రాగా, రీసెంట్‌గా ఓ బావా అనే సాంగ్ ప్రోమో విడుద‌ల చేశారు. ఫుల్ సాంగ్ నవంబ‌ర్ 18న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. ఎస్ ఎస్ థమన్ ఈ మూవీకి సంగీతం అందించాడు. 

సంబంధిత వర్గం
వెంకీమామ ఎప్పుడు వస్తున్నాడు ?
వెంకీమామ ఎప్పుడు వస్తున్నాడు ?

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.