(Local) Mon, 16 Sep, 2019

‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’ ట్రైలర్.....

September 11, 2019,   12:43 PM IST
Views: 32
Share on:
‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’ ట్రైలర్.....

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా తెరంగ్రేటం పాయల్ రాజ్ పుత్ నెగటివ్ షేడ్ లో నటించినప్పటికీ తన నటనతో, అందంతో కుర్రాళ్ళో మదిలో నిలిచిపోయింది ఈ పంజాబీ బ్యూటీ. ఆ తర్వాత ఈ భామ వెంకటేష్ తో "వెంకీ మామ" చిత్రంలో, మాస్ మహారాజ సరసన డిస్కోరాజా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నపటికీ ఈ పంజాబీ భామ ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’ సినిమా చేస్తోంది.ఈ చిత్రంలో  హుషారు’ ఫేమ్ తేజు హీరోగా శంకర్‌ భాను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. మంగళవారం ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ను అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్‌ విడుదల చేశారు. అనగనగ ఒక ఊరు.  ఆ ఊరికి ఓ సమస్య ఉన్నది.  ఆ సమస్యను పరిష్కరించేందుకు గ్రామం మొత్తం ఏకం అవుతుంది.  అదే సమయంలో పాయల్ రాజ్ పుత్ ఎంట్రీ ఇస్తుంది. ‘నిజంగా మా ఊరి సమస్య తీరుతుందంటే.. ఊరంతా ఆత్మాహుతి చేసుకుంటాం’ అంటూ నరేశ్‌ డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా ఉంది. ” వేటాడాలని అనుకునే మగవాళ్లకు  ఆడపిల్ల లేడిపిల్లలా కనిపించవచ్చు.. అదా ఆడపిల్ల వేటాడాలని అనుకుంటే మగసింహం కూడా కుక్కపిల్లాలా కనిస్తుంది”…  “అమ్మాయిలతో మాట్లాడలంటే నిజం చెప్పి, బతిమాలాడండి కరిగిపోతారు..అబద్దం చెప్పి బాధపెట్టకండి..కరిగించేస్తారు” అనే డైలాగ్స్ ఈ సినిమా మీద అంచనాలు పెంచేవిధంగా ఉన్నాయి. అయితే ఈ ట్రైలర్ చూస్తుంటే హీరోయిన్ ఓరిఎంటేడ్ అని అర్ధం అయిపోతోంది. అందుకు తగ్గట్టే పాయల్ కు మంచి డైలాగ్స్  ఇచ్చారు. రామ్ మునీష్ సమర్పణలో హ్యపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రాధన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘ఆర్‌డీఎక్స్‌ లవ్‌’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సంబంధిత వర్గం
డిస్కోరాజా ఫస్ట్ లుక్....
డిస్కోరాజా ఫస్ట్ లుక్....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.