(Local) Mon, 20 Sep, 2021

త్వరలో పట్టాలెక్కనున్న మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్

September 26, 2019,   2:17 PM IST
Share on:
త్వరలో పట్టాలెక్కనున్న మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్

దర్శకుడు మణిరత్నం ఈ పేరుకి పరిచయం అవసరం లేదు....తెలుగులో ఈయన దర్శకత్వం వహించిన ఒకే ఒక సినిమా గీతాంజలి. కానీ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అన్ని తమిళ చిత్రాలూ తెలుగులోకి అనువదించబడ్డాయి. నాయకుడు, రోజా, బొంబాయి, గీతాంజలి మొదలయిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందువల్లే తెలుగు ప్రేక్షకులకి మణిరత్నం సినిమాలంటే ఎనలేని అభిమానం. తాజాగా మాస్టర్ డైరెక్టర్ మణిరత్నం భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కి సిద్ధమవుతున్నారు. చోళ రాజుల చరిత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆ సినిమాకు పొన్నియిన్ సెల్వన్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. విక్రమ్ – కార్తీ – జయం రవి వంటి స్టార్ హీరోలు నటిస్తున్న ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయి.

తాజా సమాచారం ప్రకారం సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లో మొదలుపెట్టనున్నారు. థాయిల్యాండ్ – తమిళనాడు లో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. సీనియర్ రచయిత కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా మణిరత్నం ఈ సినిమా స్క్రిప్ట్ ని రెడీ చేసుకున్నారు. ఇక ఐశ్వర్య రాయ్ తో పాటు కీర్తి సురేష్ ఆర్.పార్తీపన్ వంటి స్టార్ యాక్టర్స్ ఈ ప్రాజెక్ట్ లో ముఖ్య పాత్రల్లో నటించనున్నారు.

సంబంధిత వర్గం
దీపావళి వేడుకల్లో బాలీవుడ్ బాదాషా కి గాయాలు....
దీపావళి వేడుకల్లో బాలీవుడ్ బాదాషా కి గాయాలు....
బ‌చ్చ‌న్ ఫ్యామిలిలో ర‌క్షా బంధ‌న్‌ వేడుక....
బ‌చ్చ‌న్ ఫ్యామిలిలో ర‌క్షా బంధ‌న్‌ వేడుక....

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.