(Local) Mon, 16 Sep, 2019

సింధూకు కొణిదెల ఉపాసన గిప్ట్......

September 10, 2019,   5:21 PM IST
Views: 47
Share on:
సింధూకు కొణిదెల ఉపాసన గిప్ట్......

మెగా ఫ్యామిలీ కోడలైన రామ్ చరణ్ భార్య ఉపాసన కోడలిగా మంచి నడవడికతో అందరిని ఆకర్షిస్తూనే, ఓ వైపు అపోలో గ్రూప్ అఫ్ హాస్పిటల్స్ బాధ్యతలను మోస్తూ మరోవైపు  బిజినెస్ ఉమెన్‌గా, అపోలో గ్రూపుకు చెందిన `బి పాజిటివ్‌` మేగ‌జైన్ ఎడిట‌ర్‌గా ఉపాస‌న ప‌లు పాత్ర‌లు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బి పాజిటివ్‌` మేగ‌జైన్ కోసం ప‌లువురు సెల‌బ్రిటీల‌ను ఇంట‌ర్వ్యూ చేసి వారి ఆరోగ్య‌ ర‌హ‌స్యాల‌ను, డైట్ ప్లాన్స్‌ను పాఠ‌కుల‌కు అందిస్తుంటారు. కాగా గతంలో వరుసగా రెండు సార్లు వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో పివి.సింధుకు స్వర్ణం మిస్ అయింది. అయినా ఏ మాత్రం నిరాశ పడకుండా కఠోర శ్రమ, లక్ష్యంతో ముందుకు సాగి ఎట్టకేలకు ఆగస్టు నెలలో వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో గెలిచి స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. కాగా స్వర్ణం నెగ్గిన పివి సింధుపై కొణిదెల రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రసంశలు కురిపించింది. సింధూకు గిప్ట్ చేస్తూ... `బి పాజిటివ్‌` కవర్‌పేజ్‌పై పివి సింధు ఫొటోస్ ఉన్న మేగ‌జైన్ సోషల్ మాధ్యమాలలో షేర్ చేస్తూ ఆమె సూపర్ మోడల్, రోల్ మోడల్ అంటూ ఉపాసన కొణిదెల తాజాగా ట్వీట్ చేసింది. 

సంబంధిత వర్గం
సైరా లో స్పెషల్ ఎఫెక్ట్స్ ఎంత ఖర్చయిందో తెలుసా....
సైరా లో స్పెషల్ ఎఫెక్ట్స్ ఎంత ఖర్చయిందో తెలుసా....
సైరా లో వీరనారిగా స్వీటీ.....
సైరా లో వీరనారిగా స్వీటీ.....

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.