(Local) Sat, 24 Aug, 2019

ఈ రోజు సాయంత్రం రా..రా అంటున్న గ్యాంగ్ లీడ‌ర్!

July 18, 2019,   2:27 PM IST
Share on:

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్న చిత్రం 'గ్యాంగ్ లీడర్'. దర్శకుడు విక్రమ్.కె.కుమార్, నాని కాంబినేష‌న్‌లో వస్తున్నా ఈ చిత్రానికి సంబందించిన అప్డేట్ వస్తుండంతో నాని అభిమానులు శాంతించారు. అయితే ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవ‌ల విడుదల చేశారు. అందులో ఐదుగురు ఆడవాళ్ళూ ఉండగా ఒకరు 70ఏళ్ల వృద్ధురాలైతే,10 ఏళ్ల పాప ఒకరు,ఒక గృహిణి, ఇద్దరు యంగ్ లేడీస్ ఇది నాని గ్యాంగ్... రివెంజర్స్ అసెంబుల్ అనే వ్యాఖ్యను జోడించిన ఫస్ట్‌లుక్ ఆసక్తిని రేకెత్తించింది.. ఈ గ్యాంగ్ కి లీడర్ అయిన నాని వీరి సహాయంతో ఎవరిపై ప్రతీకారం తీర్చుకోబోతున్నాడు అనేది ఆసక్తికరం. కాగా నేడు సాయంత్రం 7గంటలకు ‘రా… రా…’అనే సాంగ్ ని విడుదల చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా నాని తెలియజేసాడు. కాగా ఈ  విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. కలకత్తా కాళీ మాతను పోలిన ఆ పోస్టర్ ని చూస్తుంటే ఈ సాంగ్ చాలా సీరియస్ నోట్ లో నడిచేలా అనిపిస్తుంది. 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.