(Local) Mon, 20 Sep, 2021

రాగల 24 గంటల్లో - ట్రైలర్ రిలీజ్

November 06, 2019,   6:03 PM IST
Share on:
రాగల 24 గంటల్లో - ట్రైలర్ రిలీజ్

శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ సమర్పణలో, శ్రీ నవ్హాస్ క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ కానూరి నిర్మాణంలో విలక్షణ నటుడు సత్యదేవ్ హీరోగా, ఈషా రెబ్బా, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ (పైసావసూల్ ఫేమ్), ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం  ‘రాగల 24 గంటల్లో’. 'ఢమరుకం' శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు చేతుల మీదుగా విడుదలైంది. ప్రధాన పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

"నా లైఫ్ లో ఏదైనా అదృష్టం ఉందంటే అది నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడమేనంటూ" ఈషాతో సత్యదేవ్ చెప్పే డైలాగ్స్ తో ట్రైలర్ ప్రారంభమైంది. కొత్తగా పెళ్లి చేసుకున్న ఒక జంట కొత్త ఇంట్లోకి అడుగుపెట్టడం .. అక్కడ ఆ భర్త హత్య జరగడం .. పోలీసుల విచారణ .. తన భర్తను తనే చంపేశానని ఆ భార్య అంగీకరించడం ఈ ట్రైలర్లో చూపించారు. ఆమె చెప్పేది నిజమేనా? అందుకు కారణాలేమై ఉంటాయి? ఇలా ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేసేలా ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్ కట్ చేశారు.. ‘ఊహించని సంఘటనలతో ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్‌‌గా రూపొందించాం.. రాగల 24 గంటల్లో అనుకోని సంఘటనలు జరుగుతాయని తెలిసినప్పుడు ఎవరెలా స్పందించారు, అసలు ఆ 24 గంటల్లో ఏం జరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది’ అని మేకర్స్ చెప్తున్నారు. ఇప్పటివరకు కామెడీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి మొదటిసారి థ్రిల్లర్ సినిమా చేస్తుండడం విశేషం. ‘రాగల 24 గంటల్లో’ నవంబర్ 15న విడుదల కానుంది. 
 

సంబంధిత వర్గం
రివ్యూ: రాగాల 24 గంటల్లో
రివ్యూ: రాగాల 24 గంటల్లో
నవంబర్ 15 వస్తున్న ‘రాగ‌ల 24 గంట‌ల్లో’
నవంబర్ 15 వస్తున్న ‘రాగ‌ల 24 గంట‌ల్లో’

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.