(Local) Sat, 24 Aug, 2019

స‌మాజం ఓ సైకో.. సీన్ లీక్‌పై రాధిక ఆప్టే కామెంట్స్!

July 18, 2019,   12:23 PM IST
Share on:

రాధిక ఆప్టే పరిచయం అవసరం లేని నటి. కేవలం నటిగా మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన బోల్డ్ బిహేవియ‌ర్‌తోనే  వార్తల్లో నిలుస్తుంది. తాజాగా దేవ్ పటేల్, రాధికా ఆప్టే నటించిన ఆంగ్ల చిత్రం 'ద వెడ్డింగ్‌ గెస్ట్‌' విడుదలకు సిద్ధంకాగా ఇందులోని ఓ  సీన్ లో రాధికా ఆప్టే, దేవ్ పటేల్ న్యూడ్ గా కనిపిస్తూ కిస్ చేసుకునే సీన్‌ లీకై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వ్యవహారంపై  రాధికా ఆప్టే తీవ్రంగా మండిపడింది. ఆ లీకైన సీన్‌లో తనతో పాటు దేవ్‌పటేల్‌ కూడా ఉన్నారని, కానీ కేవలం రాధికా ఆప్టే సెక్స్ సీన్ అనే ప్రచారం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో నెలకొనివున్న సైకో మెంటాలిటీ పెరిగిపోయిందని చెప్పడానికి ఈ సీన్‌ లీక్ కావడమే ఉదాహరణని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ సీన్ లో తనతో పాటు నటించిన దేవ్ పటేల్ కు బదులుగా, తనను మాత్రమే టార్గెట్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించింది.  

ఓ వెబ్ సైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, ఈ చిత్రంలో ఎన్నో మంచి సీన్స్ ఉన్నాయని, వాటన్నింటినీ వదిలి, కేవలం శృంగార దృశ్యాలను మాత్రమే లీక్ చేశారని, ఇది ఎవరో కావాలని చేసిందేనని వ్యాఖ్యానించింది. బోల్డ్ సీన్లలో నటించేందుకు తానేమీ భయపడబోనని, చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూనే పెరిగానని, భారత్‌, ఇతర దేశాల్లో న్యూడ్‌గా నటులు వేదికపై నటించడాన్ని కూడా తిలకించానని పేర్కొంది. తన శరీరాన్ని చూసి తానెందుకు సిగ్గుపడాలని ప్రశ్నించిన ఆమె, ఓ నటిగా అవసరమనిపిస్తే ఎలాగైనా నటిస్తానని తెలుపుతూ బోల్డ్‌ సీన్స్‌లో నా శరీరాన్ని చూసుకొని నేనేం సిగ్గుపడటం లేదు. అవమానంగా ఫీలవ్వడం లేదు. అది ఒక వస్తువులాంటిదే. దాన్ని నేను నా నటనకు ఉపయోగిస్తున్నాను.’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.