(Local) Fri, 06 Dec, 2019

సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్ద‌రి లోకం ఒక‌టే`

November 29, 2019,   7:19 PM IST
Share on:
సెన్సార్ పూర్తి చేసుకున్న `ఇద్ద‌రి లోకం ఒక‌టే`

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శిరీష్ నిర్మాత‌గా స్టార్ ప్రొడ్యూస‌ర్‌ దిల్‌రాజు నిర్మాణంలో యంగ్ హీరో రాజ్‌తరుణ్ , షాలిని పాండే జంట‌గా తెరకెక్కుతున్న చిత్రం `ఇద్ద‌రి లోకం ఒక‌టే`. ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి జీఆర్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని `యు/ఎ` స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఈ సంద‌ర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ – “మా బ్యాన‌ర్‌లో రాజ్‌తరుణ్ హీరోగా న‌టిస్తోన్న రెండో చిత్ర‌మిది. క్యూట్ ల‌వ్ స్టోరీ. యూత్‌తోపాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా సినిమాను డైరెక్ట‌ర్ కృష్ణ తెర‌కెక్కించారు. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ చేసిన రెండు పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. త్వ‌ర‌లోనే మిగిలిన పాట‌లు, ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. సినిమా సెన్సార్ పూర్తయ్యింది. ఈ సినిమా ను డిసెంబర్ నెలలో విడుదల చేస్తున్నాము“ అన్నారు.ఈ చిత్రంలో రాజ్ త‌రుణ్‌, షాలిని పాండే, నాజ‌ర్‌, పృథ్వీ, రోహిణి, భ‌ర‌త్‌, సిజ్జు, అంబ‌రీష్‌, క‌ల్ప ల‌త తదితరులు నటిస్తున్నారు. 

సంబంధిత వర్గం

Copyright 2018 - 2019 www.telugudaily24.com. All rights reserved.