(Local) Sat, 23 Oct, 2021

‘దర్బార్’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్న నలుగురు సూపర్ స్టార్స్...

November 07, 2019,   4:54 PM IST
Share on:
‘దర్బార్’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్న నలుగురు సూ ...

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ సుభాస్కరన్ నిర్మాణంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘ద‌ర్బార్‌’. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో సూపర్ స్టార్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా ఆయనకు జోడిగా లేడి సూపర్ స్టార్ నయనతార జత కడుతున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులు జ‌రుపుకుంటుంది. కాగా ఇప్పుడు సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ‘ద‌ర్బార్‌’ మోష‌న్ పోస్ట‌ర్‌ను నాలుగు బాష‌ల్లో విడుద‌ల చేయనున్నారు. ఈ సినిమా తెలుగు మోషన్ పోస్టర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు సాయంత్రం గం.5 ని.30లకు రిలీజ్ చేయనున్నారు.

అలానే త‌మిళ్ పోస్టర్‌ను ‘విశ్వనాయకుడు’ క‌మ‌ల్ హాస‌న్ గురువారం సాయంత్రం విడుద‌ల చేయనున్నారు..హిందీ మోష‌న్ పోస్ట‌ర్‌ను సల్మాన్‌ఖాన్‌.. మ‌ల‌యాళ మోష‌న్ పోస్ట‌ర్‌ను ‘కంప్లీట్ యాక్టర్’ మోహ‌న్‌లాల్ విడుద‌ల చేయనున్నారు.  ఈ సినిమాలో నివేత థామస్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా, సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు….!!

సంబంధిత వర్గం
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...
మాస్‌ మహేష్ బాబు మండేస్‌...

Copyright 2018 - 2020 www.telugudaily24.com. All rights reserved.